The Instant View Editor uses a three-column layout, so you really want to use it on a desktop screen that's wide enough. Sorry for the inconvenience.

Back to the main page »

Original

Preview

Link Preview
జీఎస్టీ దెబ్బతో లబోదిబోమంటున్న వ్యాపారులు
 జీఎస్టీ పన్ను విధానం ఔషధ వ్యాపారులను గందరగోళలోకి నెట్టేసింది. పన్ను విధానంపై సరైన ప్రకటన వెలువడకపోవడంతో స్టాకు ఉంచుకోవాలో, లేదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. గుంటూరు (సంగడిగుంట):ఔషధ వ్యాపారులు ఇప్పటివరకు వ్యాట్‌ రూపంలో మందులపై ఐదుశాతం పన్ను చెల్లిస్తున్నారు. ఫుడ్‌ ప్రొడక్ట్స్‌పై 14 శాతం చెల్లిస్తున్నారు. ఇవన్నీ రద్దయి దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి రానుంది. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. ఔషధాలపై ఐదు నుంచి 12 శాతం, ఫుడ్‌ ప్రొడక్ట్స్‌పై 14 నుంచి 28 శాతం పన్ను విధిస్తామని మాత్రం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మూడురోజుల క్రితం ఇన్సులిన్‌, టీబీ, హెచ్‌ఐవీ మందులపై మాత్రం ఐదుశాతానికి మించి ట్యాక్స్‌ విధించబోమని స్పష్టం చేసింది. మరికొన్ని యాంటీ బయోటిక్స్‌లపై ఐదుశాతం పన్నును విధిస్తామని చెప్పింది.. కానీ ఏ యాంటిబయోటిక్స్‌ అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.  నష్టయేది ఇలా.. ప్రధానంగా ఈ వ్యాపారం కంపెనీ నుంచి మెయిన్‌ స్టాకిస్టు.. అక్కడి నుంచి సబ్‌ డీలర్‌, అక్కడి నుంచి రిటైలర్‌కు అక్కడి నుంచి వినియోగదారుడికి చేరుతుంది. కంపెనీలు ఐదుశాతం వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించి స్టాకిస్టుల నుంచి వసూలు చేసుకుంటాయి. కంపెనీ నుంచి స్టాకిస్టుకి జూన్‌ 30వ తేదీ లోపు వచ్చిన మందులపై ఐదు శాతం పన్ను చెల్లించి ఉంటుంది. ఆ రోజు తరువాత అంటే జూలై 1 నుంచి మందులు స్టాకిస్టు వద్ద ఉంటే ప్రభుత్వం 12 శాతం పన్ను అమలు చేస్తే 7 శాతం స్టాకిస్టు నష్టపోతాడు. ఫుడ్‌ ప్రొడక్ట్స్‌పై అయితే 14 శాతం వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందు వల్ల వ్యాపారులు స్టాకు ఉంచుకునేందుకు విముఖంగా ఉన్నారు. రంగంలోకి కంపెనీలు..వారం రోజులుగా ప్రధాన స్టాకిస్టుల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో అన్ని కంపెనీలు మౌఖికంగా తమ డీలర్లకు పన్నులో హెచ్చుతగ్గులు ఉంటే తాము భరిస్తామని చెబుతున్నారు. రాతపూర్వకంగా ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు. రెండు ప్రధాన కంపెనీలు మాత్రం వ్యత్యాసం ఉండే ఏడు శాతానికి తమదే బాధ్యత అని ఈ మేరకు కొంత అడ్వాన్స్‌ చెక్కులను కూడా డీలర్లకు అందజేసింది. దీంతో మిగిలిన డీలర్లు ఆయా కంపెనీలపై ఒత్తిళ్లు తెస్తున్నా ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో ఆయా కంపెనీల స్టాక్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నారు. మరో వారంలో నో స్టాక్‌ బోర్డులే..!ఇప్పటి వరకు ఔషధ డీలర్లు కొన్ని ఖరీదైన మందులు, అత్యవసర సమయంలో వాడే మందులనైతే ఏరోజుకు కారోజు తెప్పించుకుంటున్నారు. వారం రోజుల తరువాత కూడా ఇదే పరిస్థితి ఉంటే పూర్తిగా నిలిపివేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇదే జరిగితే మార్కెట్‌లో బ్లాక్‌లో అమ్మే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ప్రచారంలోకి వస్తే స్టాకిస్టులే జీఎస్టీ పేరుతో తమ వద్ద ఉన్న స్టాక్‌ను ఎక్కువ ధరలకు అమ్ముకునే అవకాశం ఉంది. జిల్లా వైద్యశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజలకు అవసరమైన మందులను నెలాఖరు వరకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.  బ్లాక్‌కు తరలింపు యత్నాలు నో స్టాక్‌ పేరుతో అత్యవసర మందులను బ్లాక్‌కు తరలించేందుకు కొందరు వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మందుల కొరతపై ప్రచారం జరుగుతున్న దృష్ట్యా దీనిని అవకాశంగా మలుచుకుని కీలకమైన మందులను ఎక్కువ రేట్లకు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కీలకమైన ఐసీయు విభాగంలో వాడే మందులను అధిక రేట్లకు అమ్ముతున్నట్లు సమాచారం.

Issue #1

Mess in text. Difficult to read. Check my template
Accepted by admin
Type of issue
IV page is missing essential content
Reported
Jun 17, 2017