The Instant View Editor uses a three-column layout, so you really want to use it on a desktop screen that's wide enough. Sorry for the inconvenience.

Back to the main page »

Original

Preview

Link Preview
చూపులతో గుచ్చి గుచ్చి..
హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): షీ టీమ్స్‌తో హైదరాబాద్‌లో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసులు.. తమ సిబ్బంది బారినుంచి వాళ్లను రక్షించలేకపోతున్నారు. దొంగతనం జరిగిందంటే సంఘటన స్థలం చూసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌.. అక్కడ వివరాలు సేకరించాల్సింది పోయి బాధిత మహిళ ఛాతీని అదేపనిగా చూశారు. బాధిత మహిళ పోలీసులకు దీనిపై ట్వీట్‌ చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. అదేపనిగా 15 నిమిషాలు..!పాతికేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న రిటైర్డ్‌ ఇంజనీర్‌.. జీడిమెట్ల అపురూప టౌన్‌షిప్‌లో ఒంటరిగా ఉంటారు. ఆయన కుమార్తె అమీర్‌పేటలో నివసిస్తారు. అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకోడానికి అసోంకు చెందిన ఒక వ్యక్తిని నియమించారు. మూడునెలలు మంచిగా పనిచేసిన ఆ వ్యక్తి.. మే 30న ఆయన నిద్రపోతుండగా రూ. 45 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. అతడు లేకపోవడంతో రిటైర్డ్‌ ఇంజనీర్‌ అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని కూతురికి చెప్పారు. ఆమె వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూన్‌ 5న స్పృహలోకి వచ్చిన ఆయన జరిగిన దొంగతనం గురించి కూతురికి చెప్పారు. 6వ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి జీడిమెట్ల ఠాణాకు ఆమె వెళ్లారు. ఘటనాస్థలాన్ని చూడాలని పోలీసులు చెప్పడంతో.. వారిని అపురూప టౌన్‌షిప్‌ వద్దకు ఆమె తీసుకెళ్లారు. అక్కడ ఆమె వివరాలు చెబుతుంటే ఓ కానిస్టేబుల్‌ నమోదు చేసుకుంటున్నారు. ఇక మరో కానిస్టేబుల్‌ మాత్రం బాధితురాలి ఛాతీని చూడటం ప్రారంభించారు. 15 నిమిషాల పాటు ఏకధాటిగా అదేపని చేశారు. దానిపై ఆమె 6వ తేదీన తెలంగాణ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌చేశారు. స్పందన లేదు. నాలుగు రోజుల తర్వాత అంటే 10వ తేదీన బాధితురాలి మిత్రుడు ఒకరు ఇదే అంశాన్ని డీజీపీ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. డీజీపీ ఆ ట్వీట్‌ను సైబరాబాద్‌ పోలీసులకు ఫార్వర్డ్‌ చేశారు. ఇప్పటివరకు ఈ అంశంపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. బాధితురాలి పట్ల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ప్రవర్తన కూడా బాగోలేదని తెలిసింది. సాయంత్రం 4.30కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే రాత్రి 8.30 వరకు తనను స్టేషన్‌లో ఉంచారని బాధితురాలు చెబుతున్నారు.

Issue #2

Article contains unsupported videos.
Accepted by admin
Type of issue
IV generated for non-target page
Reported
Jun 17, 2017