The Instant View Editor uses a three-column layout, so you really want to use it on a desktop screen that's wide enough. Sorry for the inconvenience.

Back to the main page »

Original

Preview

Link Preview
గందరగోళంలో ఉపాధ్యాయుల బదిలీలు
- తప్పుల తడకగా సాఫ్ట్‌వేర్‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:                  ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం ఏర్పడింది. ఈనెల 12తో దరఖాస్తుకు గడువు ముగియనుంది. వెబ్‌ సైట్‌లో దరఖాస్తు ఓపెన్‌ కాకపోవడంతో విద్యాశాఖ ఈ గడువును 16 వరకు పొడిగించింది. ఈనెల 9నే ఉండాల్సిన దరఖాస్తు ఎట్టకేలకు సోమవారం ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. అందులోనూ పలు లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. బదిలీలకు జీవోలో పొందుపరిచిన అంశాలు దరఖాస్తులో లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్‌ పూర్తి కాకుండా బదిలీలు నిర్వహించడంతో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? హేతుబద్ధీకరణలో ఎవరి పోస్టు పోతుందనేది తెలియకుండానే దరఖాస్తు ఎలా చేసుకోవాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ తీరును తప్పుపడుతున్నారు. బదిలీల సాఫ్ట్‌వేర్‌ కూడా తప్పులతడకగా ఉందంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులకు ఐదు పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్లు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తున్నాయి. కొందరికి 10 పాయింట్లు చూపిస్తుంటే, మరికొందరికి సున్న పాయింట్లు వస్తున్నాయి. కేటగిరి-3 కింద దరఖాస్తు చేసుకుంటే ఏడాదికి ఒక పాయింట్‌ చొప్పున రావాలి. కానీ రెండు పాయింట్లే చొప్పున వస్తున్నాయి. కేటగిరి-3 కింద దరఖాస్తు చేసుకుంటే కేటగిరి-4 కింద పాయింట్లు వస్తున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ రేషనలైజేషన్‌లో బదిలీ అయ్యే ఉపాధ్యాయునికి సంబంధించిన సూచనలు జీవోలో ఉన్నాయి. బదిలీ దరఖాస్తులో మాత్రం లేవు. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కేటగిరి-3 కింద ఏడాదికి ఒక పాయింట్‌ వస్తుంది. అదే కేటగిరి-4కు మారితే రెండు పాయింట్లు వస్తాయి. దీంతో బదిలీల్లో అనేక అవకతవకలకు ఆస్కారం ఉందని ఉందంటున్నారు. దరఖాస్తు మొత్తం నింపాక పంపితే మొత్తం మార్కులు తప్పు అంటూ తిరస్కరణకు గురవుతోందని ఉపాధ్యాయులు పేర్కొంటు న్నారు. బదిలీల ప్రక్రియలో ఇంత గందరగోళం ఉంటే ఎలా వారు ప్రశ్నిస్తున్నారు. రేషనలైజేషన్‌ ఈనెల 9వ తేదీ నాటికి పూర్తికావాల్సి ఉన్నా, ఇంకా పూర్తి కాలేదు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం నాటికి బదిలీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తమకు కొంత సమయం కావాలని అధికారులే మంత్రికి చెప్పారు. కర్ణాటక తరహాలో టీచర్ల బదిలీలకు విధానం అవసరం - సిఎంను కోరిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కర్ణాటక తరహాలో ఉపాధ్యాయుల బదిలీలపై శాస్త్రీయమైన విధానాన్ని రూపొందించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోరారు. వారు మంగళవారం సిఎంను కలిసి కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి బదిలీలకు ఒక విధానాన్ని రూపొందించిందని, అలాంటి బిల్లునే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావాలని సూచించారు. ఇలాగైతే బదిలీలకు శాశ్వత విధానం ఏర్పడుతుందన్నారు. దీన్ని తప్పక పరిశీలిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. విద్యాశాఖ ప్రస్తుతం చేస్తున్న బదిలీల విధి విధానాలు, రేషనలైజేషన్‌ తదితరాలు టీచర్లను గందరగోళపరుస్తున్నాయని వారు సిఎంకు వివరించారు. పిల్లలు బడిలో చేరే కాలంలో టీచర్లు బదిలీల గొడవలో మునిగి తేలాల్సి రావడం దురదృష్టకరమని, వేసవి కాలమంతా గడిపేసి ఇప్పుడు బదిలీలు చేయడం విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. పనితీరు పాయింట్లు అత్యంత సంక్లిష్టంగా, అశాస్త్రీయంగా ఉండటంతో టీచర్ల మధ్య చిచ్చు పెడుతున్నట్లయిందని చెప్పారు. మున్సిపల్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలుగు మీడియం పుస్తకాలను అందజేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలయన్‌ను కూడా కలిసి కోరారు.

Issue #1

Invalid date.
It appears the site always has the same invalid value in the "datetime" attribute: `2014-05-17T21:43:21+00:00`

Formatted date is correct though. So we have to use it.
And no, we can't use a time from datetime with this date, because the time is invalid.
Accepted by admin
If conflicting dates are stored in multiple places on the source page, preference should be given to the time that is visible to the ordinary user who views the page in a browser:
https://instantview.telegram.org/checklist#6-9-date-and-time

Før's template handles this case better:
https://instantview.telegram.org/contest/prajasakti.com/template3/
Type of issue
IV page is missing essential content
Reported
Jun 14, 2017